![]() |
![]() |
.webp)
బుల్లితెర మీద జబర్దస్త్ ఎంతలా ఫేమస్ అయ్యిందో అందులో కమెడియన్స్ గా చేసే బులెట్ భాస్కర్ అండ్ నాటీ నరేష్ అంతకన్నా ఫేమస్. ఈ జోడిలో ఒక్కరు లేకపోయినా ఏదో వెలితిగానే ఉంటుంది. అలాంటి కమెడియన్స్ లో పొట్టివాడు కాదు గట్టివాడు అనిపించుకుని గర్వంగా తన టీమ్ ని తలెత్తుకునేలా చేసిన నాటీ నరేష్ ఒక చిట్ చాట్ లో చాలా విషయాలు చెప్పుకొచ్చాడు. "అందరూ నన్ను ఈఎంఐల కట్టుకోవడం కోసమే ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం లేదు అనుకుంటున్నారు. కానీ చెప్పాలంటే ముందుగా నన్ను ఎవరూ చూడడం లేదు.
నన్ను అందరూ ఎత్తుకుంటారు తర్వాత ఎవరూ చూడరు. అమ్మాయిలతో మాట్లాడ్డం అంటే నాకు సిగ్గు. ఒక వేళా నేను పెళ్లిచూపులకు వెళ్లినా, పెళ్లి చేసుకున్నా కూడా ముఖ్యంగా నాతో పాటు బులెట్ భాస్కర్ కి మాత్రం చెప్పను, తీసుకెళ్లను. ఎందుకంటే ఇలాంటోడికి పిల్లనిస్తారా అని అడిగి మరీ నా పెళ్లి చెడగొడతాడు. నాకు లైఫ్ ఇచ్చింది కాబట్టి ముందు జబర్దస్త్ కె ఫస్ట్ ప్రిఫెరెన్సు ఇస్తాను. జబర్దస్త్ మంచి గుర్తింపు ఇస్తుంది. శ్రీదేవి డ్రామా కంపెనీ ఫైనాన్సియల్ గా బలాన్ని ఇస్తుంది. టీవీ షోస్ తో ఈవెంట్స్ తో చాలా బిజీగా ఉంటాను అందుకే మూవీస్ లోకి ఎక్కువగా రావాలని అనుకోవడం లేదు. ఐతే నాకు నటన అంటే ఎప్పుడూ ఇష్టం లేదు. ఎందుకంటే నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. డాన్సర్ అవడానికి ఇండస్ట్రీకి వచ్చాను. ఢీ జూనియర్స్ లో చేద్దామనుకున్నా వాళ్ళు నన్ను గ్రూప్ డాన్సర్స్ లో పెట్టేసారు. తర్వాత బులెట్ భాస్కర్ నాకు యాక్టింగ్ నేర్పిస్తా అన్నాడు. నాకు ఇష్టం లేదు అని చెప్పా. అలా డాన్సర్ ని అవడానికి ఇండస్ట్రీకి వచ్చి ఆర్టిస్ట్ ని అయ్యాను." అంటూ చెప్పుకొచ్చాడు.
![]() |
![]() |